ఎఫ్‌ఆర్వో హత్య హేయమైన చర్య
శ్రీనివాసరావు మృతి పట్ల కలెక్టర్ సంతాపం

భద్రాద్రి : అడవుల సంరక్షణకు విధి నిర్వహణలో అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీ రేంజ్ అధికారిపై పోడు సాగుదారులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ దాడిలో అటవీ రేంజర్ శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి మృతి చెందడం చాలా బాధించిందని చెప్పారు. ఫారెస్టు భూముల్లో నాటిన మొక్కలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను అడ్డుకునేందుకు వెళ్లిన శ్రీనివాసరావు, రామారావుపై దాడి చేశారని చెప్పారు. రేంజర్ మరణానికి కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు చేపడుతామని తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన శ్రీనివాస్ కుటుంబానికి జిల్లా యంత్రాంగం తరుపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఎఫ్‌ఆర్వో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.