CAలో దివ్యా రెడ్డి ఫస్ట్‌ క్లాస్‌

కొత్తగూడెం : కొత్తగూడెంకు చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ వై శ్రీనివాస్‌ రెడ్డి కుమార్తె దివ్యా రెడ్డి ఆల్‌ ఇండియా స్థాయిలో సిఎలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఈసందర్భంగా శుక్రవారం నలంద వివేకవర్ధని కళాశాల చైర్మన్‌ ఎంవి చౌదరి, కాలేజీ లెక్చరర్స్‌ సిఎ సాధించిన దివ్య రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందించారు. హైదరాబాదు నుండి సిఎ అకాడమీ పెద్దలు దివ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్య రెడ్డి మాట్లాడుతూ సిఎ సాధించడానికి నలంద కళాశాల యాజమాన్యం పూర్వ లెక్చరర్స్‌, సిఏ ఎక్స్‌పర్ట్స్‌ ఇచ్చిన సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో సహకారం అందిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సిఎగా స్థిరపడి కామర్స్‌ రంగంలో తన సేవలు అందిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా ఇంటర్‌ ఎంఈసిలో నలందాలో కాలేజీ ఫస్ట్‌తోపాటు స్టేట్‌ స్థాయిలో 9వ ర్యాంకు సాధించింది. తర్వాత సిఎ చదువును ఎంచుకొని సిఎతో పాటు బీకాం, ఎంబీఏ, ఐపిసిసి తోపాటు గురువారం ప్రకటించిన ఆల్‌ ఇండియా స్థాయి సిఎ ఫైనల్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం గమనార్హం,

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading