పిఎస్ఆర్ మైనార్టీ వింగ్ ఎఎండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిళ్ల వితరణ

కొత్తగూడెం : పి ఎస్ ఆర్ మైనారిటీ బి, ఎండి ఫౌండేషన్ ఫర్ సోషల్ చేంజ్ సంయుక్తంగా నిరుపేద విద్యార్థులకు సైకిలు విత్ అనగా అందజేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పదో డివిజన్ లోని బూడిదగట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏఎండి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదిల్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు  తోట దేవి ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఎస్ లలితా కుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తో పాఠశాలలో మధ్యాహ్న భోజనంతోపాటు వసతులు కల్పిస్తుందని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేనిరుపేద విద్యార్థులకు ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాలతో చేతనందిస్తున్న ఎస్ ఆర్ మైనార్టీ వింగ్, ఏ ఎండి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదిల్ ను అభినందించారు. అనంతరం నిరుపేద విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ వై శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు జల్లి శ్రీలక్ష్మి, ఎండి దావూద్, మాజీ కౌన్సిలర్లు కనుకుంట్ల కుమార్, తెలుగు అనిల్, కాంగ్రెస్ మైనారిటీ నాయకులు గౌస్, నదీమ్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading