ర్యాంకర్ ను అభినందించిన కలెక్టర్ అంకిత్
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుమార్తె అద్భుత ప్రతిభ

కొత్తగూడెం : ప్రభుత్వ గురుకులంలో ఇంటర్ విద్యను అభ్యసించి రాష్ట్రస్థాయిలో ర్యాంకును సాధించిన సాత్వికను జిల్లా కలెక్టర్ అంకిత్ అభినందించారు. గురుకులంలో ఇంటర్ విద్యను అభ్యసించి రాష్ట్రస్థాయిలో ర్యాంకును సాధించినందుకు జిల్లా కలెక్టర్ సాత్వికను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యున్నతమైన ప్రతిభగల ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారనటానికి నిదర్శనం సాత్వికేనని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించే ,వారికి దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు సైతం ఎవరికి తీసిపోరని నిరూపించింది,అని అన్నారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అనుకున్న లక్ష్యాన్ని చేరేలా సాత్వికను ఆశీర్వదించారు.
సాత్విక తండ్రి సామాజిక సేవకుడు ప్రాణదార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ బాబు జిల్లా కలెక్టర్ అంకిత్ కు పూల మొక్క ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ సంతోష్ బాబు కూమార్తె ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించింది. హనుమాన్ బస్తీకి చెందిన ఈ సాత్విక తాజాగా విలువడిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో స్టేట్ ర్యాంకు సాధించి విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సాధారణ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ సంతోష్ బాబు కుమార్తె ఇంతటి ఘనతను సాధించటం గర్వకారణం. ఈ కార్యక్రమంలో ఈ సంతోష్ బాబు తో పాటు సాత్విక మేనమామ యన్ .శ్రీకాంత్ పాల్గొన్నారు.