బైక్ దొంగ అరెస్టు

కొత్తగూడెం : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఎస్సై విజయ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంతో అటుగా వస్తున్న ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పటుకుని విచారించగా కొత్తగూడెం బస్టాండ్ ఏరియాలో మూడు బైకులను దొంగతనం చేసినట్లుగా అంగీకరించినట్లు వన్టౌన్ సిఐ కరుణాకర్ వెల్లడిరచారు. నిందితుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో రత్నాల చెరువు గ్రామానికి చెందిన సల్లా చంద్రశేఖర్ ప్రస్తుతం చుంచుపల్లి మండలం హోసింగ్ బోర్డు కాలనీలో నీవాసం ఉంటున్నట్లు స్పష్టం చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. బైక్ దొంగను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ఘని, కానిస్టేబుళ్ళు సురేష్, వీరన్న, నరేష్, ప్రసాద్‌లను ఈ సందర్బంగా సిఐ అభినందించారు.