అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదానం

కొత్తగూడెం : శబరిమల అయ్యప్ప ఆలయాంలా కొత్తగూడెం పట్టణం రైటర్‌బస్తీలోను 18 మెట్లతో వెలసి అపర శబరిమగా పేరుగాంచిన శ్రీధర్మశాస్తా ఆలయంలో అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములకు నిత్య అన్న దాన కార్యమ్రంతోపాడు సంధ్యా వేళల్లో నిత్య అల్పాహారం కూడా ఉచితంగా అందజేస్తామని ఆలయ వైస్ చైర్మమన్ పి వీరవర్ధనరావు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 10 వరకు ఈ నిత్య అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుందని అన్నారు. అన్నదానంతోపాటు రాత్రి పూట భిక్ష కూడా ఉచితంగా ఆలయ ప్రాంగణంలో స్వాములకు అందిస్తామన్నారు. ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రముఖ డాక్టర్ నాగరాజు ఈనెల 18న ప్రారంభించగా రాత్రి అందించే అల్పాహారాన్ని స్వయంగా తనే ప్రారంభించినట్లు తెలిపారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ వైస్ చైర్మన్ వీరవర్థనరావు కోరారు.