ఎమ్ఎస్ ఆర్ మనకు ఆదర్శప్రాయుడు
- దాతృత్వాన్ని అలవర్చుకుందాం
- డివైస్ సి అచ్యుతరామయ్య

రుద్రంపూర్ : మన సంపాదనలో కొంత భాగాన్ని తీసి అభాగ్యులు, అనాధల కోసం వెచ్చించడం వల్ల మనకు దేవుడు అంతకుమించి ధనాన్ని ఇస్తాడని సివిల్ డీవైఎస్ఈ అచ్యుతరామయ్య అన్నారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో ఎంఎస్ఆర్ ఇన్ఫ్రా అధినేత మారుతి శ్రీనివాసరావు పేదలకు బెడ్ షీట్లు పంపిణీ కార్యక్రమాన్ని మథర్ థెరిస్సా సేవా సంస్థ అధ్వర్యంలో నిర్వహించారు. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించి 25 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మారుతి శ్రీనివాసరావును ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. ప్రతీ ఒక్కరూ తమకు తోచినంత సాయం చేస్తే పేదలు కూడా ఎంతోకొంత మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ ఈశ్వర్, మథర్ తెరిస్సా సేవా సంస్థ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, బోట్ల ప్రసాద్, ద్రాక్ష శ్రీను, బొజ్జం సంపత్, లిక్కి చంద్రశేఖర్, చిట్టి సంపత్ కుమార్ రెడ్డి, మునవర్, కొండ రాజు, బడే రమేష్ తదితరులు పాల్గొన్నారు.