నఖిలీ విలేఖరుల అరెస్ట్‌

  • విలేఖరుల ముసుగులో బ్లాక్‌ మెయిల్‌ చేస్తే కఠిన చర్యలు
  • సిఐ కరుణాకర్‌

కొత్తగూడెం : నఖిలీ విలేఖరుల అవతారమెత్తి బందువులనే బ్లాక్‌మేల్‌ చేయబోయి కొత్తగూడెం వన్‌ టౌన్‌ పోలీసులకు చిక్కారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సిఐ కరుణాకర్‌ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మేము విలేఖరులము వార్త రాయకుండా ఉండాలి అంటే డబ్బులు ఇవ్వాలంటూ  వేధించిన ఘటనలో ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశామన్నారు. దాసరి పూర్ణ అనే మహిళ మృతి చెందిదని,  అయితే అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమే భర్త కొట్టి చంపాడని వార్త రాస్తామని ఆమే దూరపు బంధువు సన్యాసి బస్తీకి చెందిన దాసరి సాంబశివరావు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు .

మృతిరాలి కొడుకు దాసరి కార్తిక్‌కి రిపోర్టర్‌ని అంటూ శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి మీ తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే మీ తండ్రి చంపాడని పేపర్లో వార్త రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. మళ్ళీ కొద్ది సేపటికే మరల ఫోన్‌ చేసి మా మనుషులు ఇంటికి వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుతారు అని చెప్పి ఫోన్‌లో బ్లాక్‌మేయిల్‌ చేసినట్లు తెలిపారు.

అదే రోజు రాత్రి సుమారు 9గం.కు కార్తీక్‌ ఇంటికి శ్రీనివాస్‌, సాంబశివరావు మరో ముగ్గురు వ్యక్తులు రమేష్‌, రాజేష్‌, గణేష్‌ వెళ్లి పత్రికా విలేకరులమని చెప్పి డబ్బులు ఇవ్వాలని బెదిరించారంటూ బాదితుడు కార్తిక్‌ ఈ నెల 15న వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. విచారణ చేపట్టగా బెదిరింపులకు పాల్పడినట్లు తేలడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు . కొత్తగూడెం పట్టణంలో కొంతమంది వ్యక్తులు విలేకరులమని చెబుతూ ఒక ముఠాగా ఏర్పడి సామాన్య ప్రజలను డబ్బుల కోసం వేధిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, దీనివలన నిజాయితీగా పనిచేసే విలేఖరులకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఎవరైనా విలేకరులమని చెప్పి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ కరుణాకర్‌ హెచ్చరించారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading