మహిళా ఉద్యోగులకు రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలి

కొత్తగూడెం : పివికె 5ఇంక్లైన్ నందు మహిళా ఉద్యోగులకు రెస్ట్ రూమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఐఎన్‌టియూసి ఏరియా వైస్ ప్రసిడెంట్ రజాక్ డిమాండ్ చేశారు. శనివారం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐఎన్‌టీయూసి తరపున మైన్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ సింగరేణి నిర్వహించిన ఎక్స్‌ట్రన్నల్ రిక్రూట్మెంట్‌లో సెలెక్ట్ అయిన మహిళా అండర్ మేనేజర్ ట్రైనీలు, జెఎంఈటీ ట్రైనీలు, ఈఅండ్‌ఎం సూపర్ వైజర్లు, టెక్నీషియన్స్ సుమారు 15మంది మహిళా ఉద్యోగులు విధుల్లో చేరినట్లు స్పష్టం చేవారు.
అన్ని సౌకర్యాలతో కూడిన రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసి, ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన మేనేజర్ త్వరలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిస్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైమన్ బ్రాంచి సెక్రటరి,చిలక రాజయ్య, కనకారావు, సాయి ప్రసాద్, వల్లాలసంబమూర్తి, బాలు, బోరింగ్ శంకర్, సంపత్, ప్రభాకర్, శ్రీకాంత్, నాగేశ్వరావు, హరియా, భూక్య శ్రీరామ్, సందీప్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.