ఐఎల్‌పిఎ క్యాలెండర్‌ ఆవిష్కరణ

  • ప్రజలను చైతన్యపరచడంలో అగ్రగామిగా ఐఎల్‌పిఎ
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌

కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టులో ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (ఐఎల్‌పిఎ) క్యాలెండర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ ఫూలే, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచనలు ఈ సంస్థకు పునాది అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవానికి అర్హుడని, ఐఎల్‌పిఎ ఈ విలువలను సమాజంలో విస్తరించేందుకు పాటుపడుతోంది అన్నారు. జనవరి 3న విద్యా తల్లి సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ప్రాశస్త్యమైందన్నారు. ఇది విద్యా విప్లవానికి ఇచ్చే గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయబద్ధతను ప్రజల్లో చైతన్యం చేయడంలో ఐఎల్‌పిఎ అగ్రగామిగా ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ఈ సంస్థ స్ఫూర్తిదాయకంగా పనిచేస్తోందన్నారు. సమాజంలో అన్ని వర్గాల మనుషులు సమాన హక్కులు పొందాలన్న లక్ష్యంతో ఐఎల్‌పిఎ నిరంతరం ముందుకు సాగుతోంది అని అభినందించారు.

ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీమతి భానుమతి , శ్రీ రామారావు , శ్రీమతి సాయి శ్రీ హాజరయ్యారు. అలాగే, %IూూA% ప్రతినిధులు సీనియర్‌ న్యాయవాది వివి సుధాకర్‌ రావు , మహిళా న్యాయవాది భానుప్రియ , గాజుల రామ్మూర్తి , జే గోపికృష్ణ , బండ్ల రాజశేఖర్‌ గారు, నరసింహ చారి , సాదిక్‌ పాషా , మారపాక రమేష్‌ కుమార్‌ , వడ్లకొండ హరిప్రసాద్‌ , దొడ్డ సామంత్‌ , వై.వై. నాయుడు , అంకుష్‌ పాషా , రాధాకృష్ణ , జింక మన్మోహన్‌ , రామారావు తదితర సీనియర్‌ మరియు జూనియర్‌ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

 

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading