118న బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం

కోల్ బెల్ట్ : సిఎండి ఎన్.బలరామ్, డైరెక్టర్ పా గౌతం పోత్రు సూచనల మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నవంబర్ 18 న కార్పొరేట్, కొత్తగూడెం ఏరియాలలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు , రిటైర్డ్ కార్మికులు, కుటుంబసభ్యులకు కార్పొరేట్ ఏరియాలోని ప్రకాశం స్టేడియంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కార్పొరేట్, కొత్తగూడెం ఏరియాలో పనిచేసే రెగ్యులర్,కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, మెడికల్ కార్డ్ హోల్డర్స్, 35 ఏళ్ల పై ఉన్న మహిళా కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైద్య పరీక్షలకు వచ్చే మహిళలు పరీక్షల కొరకు ఉదయం 9 గంటల నుంచి ప్రకాశం స్టేడియం కి రావాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ తెలిపారు.