హామీలు నెరవేర్చాం… మాట నిలబెట్టుకున్నాం

  • 5వేల మంది జీపీవోల నియామకం
  • గ్రామ స్ధాయిలో రెవెన్యూ సేవలు
  • 5న సిఎం నియామక పత్రాలు అందజేత : మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌ : గ్రామస్ధాయిలో రెవెన్యూ వ్యవస్ధను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో తెంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని జీపీవో నియామకంతో నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ సమస్యలపై ప్రధానంగా రైతాంగానికి మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో గ్రామ స్ధాయిలో రెవెన్యూ శాఖలో జీపీవో సేవలను అందుబాటులోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. సిఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 5న సాయంత్రం 4 గంటలకు జీపీవోలకు హైటెక్స్‌లో నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ జీపీవోలుగా విధులు నిర్వవణకు ఆసక్తి చూపిన విఆర్వో, విఆర్‌ఎలకు రెండు విడతల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో 5,106 మంది ఎంపికయ్యారని వెల్లడిరచారు. వీరి రాకతో గ్రామస్దాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులతరం అవుతాయి అన్నారు. చెబితే వినలేదన్న అక్కసుతో విఆర్వో, విఆర్‌ఎ వ్యవస్దను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఈ చర్యతో గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సిఎం ఆలోచనకు అనుగుణంగా రెవెన్యూ సేవలు గ్రామ స్దాయి వరకు అందించాలనే లక్ష్యంతో గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తున్నామని ప్రకటించారు. చారిత్రాత్మకమైన భూ భారతి చట్టం ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండిరగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వే విభాగం బలోపేతం తోనే రెవెన్యూ వ్యవస్ధలో మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వేవిభాగాన్ని బలోపేతం చేస్తున్నామని గత పదేళ్ళలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.

రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాప్‌ తప్పనిసరి చేసిన నేపధ్యంలో అవసరమైన లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలను వచ్చేనెల మొదటివారంలో అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడతలో 7వేల మందికి శిక్షణ ఇచి, అర్హత పరీక్ష పూర్తి అయ్యిందన్నారు. అప్రెంటిస్‌ శిక్షణ త్వరలో పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 18 నుండి రెండవ విడతలో మూడు వేల మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading