జేసికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాలరావుకు రెవిన్యూ మంత్రి క్యాంప్ ఆఫీస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో జేసికి పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ గా వేణుగోపాలరావు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తు ఆయన రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, పీతాంబరం, రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాల పాసి, పోస్ట్ ఆఫీస్ వాసు, కేకే శ్రీను,లక్ష్మణ్ అగర్వాల్,గొల్ల శ్రీను, కున్సోత్ కిషన్,తదితరులు పాల్గొన్నారు.