26 న మాదిగ వనభోజనాలు
- విజయవంతం చేయండి చదలవాడ సూరి

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్, డాక్టర్ బి ఆర్అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగ వనభోజనాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గూడెల్లి యాకయ్య, మంద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 26 న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ వన భోజనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుంచి యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, ప్రతి కుటుంబం పాల్గొని విజయవంతం చేసి ఐక్యతను చాటాలని కోరారు. ముందుగా మాదిగ యువకులు, విద్యార్థులు, కళాకారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు అయ్యి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మోదుగు జోగారావు, వేల్పుల భాస్కర్, వానపాకుల రాంబాబు, ఉలవులపూడి జానకిరామ్, గుండేటి వెంకట్, రాములు పుల్లూరి కుమార్, దూడపాక శివ ప్రసాద్, కత్తి బాలకృష్ణ, కొప్పుల రమేష్, కేశపాక వెంకటేశ్వర్లు, తోకల వెంకటేశ్వర్లు, బొట్ల శ్రీను, గణిపాక సుధాకర్, ఐలపొంగు సురేష్, మొగిలిపాక మురళీకృష్ణ, ప్రవీణ్, ఇనపనూరి రమేష్, కుంపటి నాగరాజ్, చదలవాడ సామిల్, కాకటి బాబు, ఓదెల శంకర్, కండే చంద్రకుమార్, కోతర్ల యశ్వంత్ కుమార్, డేవిడ్, చదలవాడ రాము, ముస్కూరి ప్రభు, చుట్టుగుళ్ళ రాంబాబు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.