రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలి
- తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలి
- కొల్హాపూర్ బెల్గావి ఎక్స్ప్రెస్ ట్రైన్ ను కొనసాగించాలి
- వై శ్రీనివాస్ రెడ్డి డిమాండ్.

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే సంచలన్ భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి మెంబర్స్ సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి హాజరైన డిఆర్ యు సి సి మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి చర్చల్లో పాల్గొని మాట్లాడుతూ కొత్తగూడెం నుండి తిరుపతికి ప్రత్యేక రైలు నలుపుతామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఎప్పుడు ఈ రైలు నడుపుతారని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట డోర్నకల్ టు మణుగూరు వరకు గతంలో నడిపిన ప్యాసింజర్ రైలును, కొలహపూర్ బెల్గావి ఎక్స్ప్రెస్ ను ఎందుకు ఆపారని ఈ ట్రైన్స్ ను తక్షణమే నడపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు గత నాలుగు సంవత్సరాలుగా నత్త నడక నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం నడిబొడ్డున రాజీవ్ పార్కు ప్రగతి మైదానం ఎన్జీవోస్ కాలనీ మధ్యలో గత అనేక సంవత్సరాలుగా ఉన్న రైల్వే ట్రాక్ దారిని మూసివేసారని, దీనివలన ప్రజలు,వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ దారిని తిరిగి ఓపెన్ చేయాలని అధికారులకు విన్నవించారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ ఫామ్ వన్ కు రాకుండా రెండవ ప్లాట్ ఫామ్ మీద ఆపుతున్నారని దీనివలన ప్రయాణికులు వృద్ధులు మహిళలు దివ్యాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తిరిగిసూపర్ ఫాస్ట్ ట్రైన్ నెంబర్ వన్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుండి త్రీ టౌన్ గొల్లగూడెం సెంటర్ వరకు రహదారి వెడల్పుకు పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి అభ్యర్థన మేరకు స్థలం తక్షణం ఏర్పాటు చేసి రహదారి వెడల్పుకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రైల్వే సమస్యలపై వినతి పత్రాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాల కృష్ణన్ కి శ్రీనివాస్ రెడ్డి అందించడం జరిగిందిదీంతో అధికారులు స్పందిస్తూ సమస్యలను ఒక దాని వెంట ఒకటి సావధానంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారుసమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు డి ఆర్ యు సి సి మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.