చర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
- కండువా కప్పి ఆహ్వానించిన డిసిసి దేవి ప్రసన్న

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలపై అభిమానంతో, పొదెం వీరయ్య నాయకత్వంపై ఉన్న విశ్వాసం, నమ్మకంతో గ్రామస్తులంతా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామస్తులంతా కాంగ్రెస్ కుటుంబంలో భాగస్వాములం అయ్యామని సంతోషం వ్యక్తం చేస్తూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామని స్పష్టం చేశారు. ముందుగా మొదటిసారి మండలానికి వచిన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న కు చర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.