సర్పంచ్ ఎన్నికల్లో సిపిఐత పొత్తు ఉండదు
- రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

కొత్తగూడెం : సర్పంచ్ ఎన్నికల్లో పాల్వంచ మండలంలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేవని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ రావు తేల్చి చెప్పారు. మంగళవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో పాల్వంచ మండల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి పొత్తులు లేకుండా స్వంతంగా పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసే పంచాయతీల్లో రెబల్ అభ్యర్థులు ఎవరైనా పోటీలో ఉంటే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధినాయకుల ఫోటోలు, పార్టీ వ్యక్తులను ప్రచారంలో వాడుకుంటే కార్యకర్తలు తమ దృష్టికి తీసుకురావాలని పార్టీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాలే జానకి రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు ఉండేటి శాంతి వర్ధన్, ధర్మసౌత్ ఉపేందర్ నాయక్, వాసమల్ల సుందర్రావు, డిష్ నాగేశ్వరరావు, భాషబోయిన అశోక్, కీసర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు