సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం
- కారుణ్య ఉద్యోగాలపై ఏసీబీ విచారణ ఆపాలి
- సింగరేణికి బకాయిలు రూ 50 వేల కోట్లు చెల్లించాలి
- సంఘం ఎఐటియుసి డిమాండ్

కొత్తగూడెం : కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని గుర్తింపు సంఘం ఎఐటియుసి అధ్యక్ష, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. బుధవారం ఉదయం కొత్తగూడెం శేషగిరిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కారుణ్య ఉద్యోగాలపై ఏసీబీ విచారణ నిలిపివేయాలని, సంస్థలో కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారని మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న రూ 50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని వాటిని చెల్లించకుండా కావాలని సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లి సింగరేణి సంస్థను సర్వనాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత పది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు,యాజమాన్యం కలిసి ,కొత్త గనులను ప్రారంభించకుండా సంస్థ లో కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారని మెడికల్ బోర్డు నిలిపివేశారని మండి పడ్డారు.అదేవిధంగా క్రమంతప్పకుండా స్ట్రక్చర్ కమిటీను నిర్వహించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరారు,ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కే. వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య,వై.వి రావు,కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్,బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్,సందబోయిన శ్రీనివాస్,గోపి,హుమాయూన్, నితిన్,గంగారం,మండల రాజేశ్వరరావు,లక్ష్మీనారాయణ, సోమయ్య,రమేష్,తదితరులు పాల్గొన్నారు