దొంగను దొరకపట్టిన వన్ టౌన్ పోలీసులు

  • వెండి ఆభరణాలు స్వాధీనం

ఎస్ హెచ్ వో కరుణాకర్

కొత్తగూడెం : సాయిబాబా గుడిలో వెండి ఆభరణాలు అపహరించిన దొంగను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ హెచ్ వో ఎం కరుణాకర్ వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్యాసి బస్తి సాయి బాబా మందిరంలో ఈ నెల 15న మూడు వెండి కడియాలు, కుంకుమ భరణి దొంగిలించబడ్డాయి. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో రామాటాకీస్ ఏరియాకు చెందిన బొబ్బర్ల శ్రీనివాస్ ను నిందితునిగా పోలీసులు గుర్తించారు.

పాత కొత్తగూడెం ఎన్టీఆర్ బొమ్మ వద్ద దొంగిలించిన ఆభరణాలతో సహా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు గుడి పూజారి బొబ్బర్ల శ్రీనివాస్ ఈ నెల 15న ఉదయం సమయంలో గుడిలోనికి ప్రవేశించి మూడు వెండి కడియాలు, కుంకుమ భరణి దొంగిలించి పరారీలో ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ లు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగిలించిన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ సుమారు రూ 7500 ఉండుందని సిఐ కరుణాకర్ వెల్లడించారు. ముద్దాయి శ్రీనివాస్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని స్పష్టం చేశారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading