ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించవచ్చు
- ఘనంగా దివ్యాంగుల క్రీడా పోటీలు
- ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించవచ్చు
- ఏఐటియూసి సహాయ కార్యదర్శి గట్టయ్య
కోల్ బెల్ట్ : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రంపూర్ ఆర్ సి ఓ ఏ క్లబ్ నందు దివ్యాంగులకు జిఎం శాలెం రాజు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గుర్తింపు సంఘం ఏఐటియుసి సహాయ కార్యదర్శి జె.గట్టయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి విద్య, ఉద్యోగం, క్రీడలు, సామాజిక కార్యకలాపాలలో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం అన్నారు.
దివ్యాంగుల పట్ల ఉన్న అపోహలను తొలగించి, సమాజంలో ఒక భాగంగా అంగీకరించేలా ప్రజలలో అవగాహన పెంచాలి అన్నారు. దివ్యాంగులు తమకున్న పరిమితులను అధిగమించి, ఎన్నో విజయాలు సాధించగలరని ఆత్మవిశ్వాసం కల్పించి, ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ జిఎం పర్సనల్ కిరణ్ కుమార్, సేవ కమిటీ అధ్యక్షురాలు మధురవాణి, తదితరులు పాల్గొన్నారు.