ఆటల్లో గెలుపోటములు సహజం

టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం, పాల్వంచ మండలం కేంద్రంలో దంతెలబోర గ్రామ పంచాయతీ యూత్ ఆధ్వర్యంలో 5 మండలాల వాలీబాల్ టోర్నమెంట్ సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ మండల స్థాయి వాలిబాల్ టోర్నమెంట్ పోటీలకు ముఖ్య అతిధిగా హాజరైన టీపీసీసీ హాజరై నాగా సీతారాములు మొదటి రోజు పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతకు సత్సంబంధాలు మెరుగుపర్చలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జిల్లా, జాతీయ స్ధాయిలో రాణించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతా యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని, ఏఆటలోనైనా గెలుపు, ఓటమి అనేది సహజం కాని చివరి వరకు పోరాడాలన్నారు. ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం తమ చెంతకి చేరితుందని అని అన్నారు.

యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్యాభివృద్ది చేసుకొని క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్ది కిషోర్, కొత్తగూడెం పట్టణ ఓబిసి అధ్యక్షులు జయప్రకాష్, ఓబీసీ నాయకులు బొబ్బల వెంకట యాదవ్ ,బొల్లం ఉదయ్ కుమార్ యాదవ్, రవికుమార్, సాయి చందు, స్థానిక నాయకులు కోండ్రు ప్రసాద్, పాలెబోయిన నాగరాజు, శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading