10వ తరగతి విద్యార్థులు పరీక్షా కిట్ల పంపిణి
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి : చీకటి కార్తీక్

కొత్తగూడెం: విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాలని యూత్ కాంగ్రెస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ సూచించారు. పాల్వంచ మండలం కెపి జగన్నాధపురం లోని ప్రభుత్వ జెడ్పి హైస్కూల్ లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆధారిటీ కమిటీ సభ్యులు జోషి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్, పెన్సిల్, స్కెల్ తో కూడిన పరీక్ష కిట్స్ లను చీకటి కార్తీక్ పంపిణి చేశారు.
ఈ సందర్బంగా విద్యార్థులు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుందని ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలని తెలిపారు.

విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలితాలను పొందాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరేలా విద్యార్థులకు పలు రకాల మార్గదర్శకం చేశారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు బానోత్ బాలాజీ నాయక్, ధర్మపురి ప్రసాద్, దంతూజు కామాచారి, తిప్పిరెడ్డి లచ్చిరెడ్డి, బానోత్ కుమార్, భూక్య ప్రసాద్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ నాగారం కాలనీ నల్లమోతు పవన్, వన్నాపురం నరేష్, మాలోత్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.