మంత్రి పొంగులేటిని కలిసిన సలహా మండలి సభ్యులు

కొత్తగూడెం : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టెలికం అడ్వైజరి కమిటీ సభ్యులు బోదాస్‌ కనకరాజు, రీజనల్‌ ట్రాన్స్పోర్ట్‌ అధారిటి కమిటీ సభ్యులు బాదర్ల జోషి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నియవితులైన సందర్భంగా మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ పై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న తమ శ్రమను గుర్తించి నామినేట్‌ పదవులు ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగులోత్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading