నంబర్ ప్లేట్లు లేకుంటే కఠిన చర్యలు
రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం
ట్రాఫిక్ ఎస్సై నరేష్

కోతగూడెం: నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలపై తిరిగే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్సై నరేష్ హెచ్చరించారు. మంగళవారం కోతగూడెం పట్టణంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రదాన కూడళ్ల వద్ద నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను ఆపి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ సూచనలతో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు సుమారుగా నంబర్ ప్లేట్లు లేని 40 వాహనాలను ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి జరిమానా విధించినట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడే నేరస్తులు ఎక్కువగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను వినియోగిస్తున్నారని, అట్టి నేరాలను అదుపు చేయడం కోసమే నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పోలీసులు చేపట్టే కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ ఎస్ఐలు మదార్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.