క్రీడల్లో పోలీసులకు వన్నె తెస్తున్న వీరభద్రం
- అందరికీ స్ఫూర్తిదాయకం
- ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం : తెలంగాణ 11వ స్టేట్ లెవెల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ – 2025 పోటీలలో పతకాలను సాధించిన ఏఆర్ హెడ్కానిస్టేబుల్ వీరభద్రం ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి జిఎంసీ బాలయోగి స్టేడియంలో జనవరి 4,5 తాదీల్లో జరిగిన 11th తెలంగాణ స్టేట్ లెవెల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ – 2025 పోటీలలో బంగారు, రెండు వెండి పతకాలను సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వీరభద్రంని ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఘనంగా సన్మానించారు.
50 ప్లస్ వయసు విభాగంలో 1500కిమీ బంగారు పథకాన్ని , 5కి.మీ, 400 కి.మీ పరుగు పందెం విభాగాల్లో రెండు వెండి పథకాలను సాధించడం హర్షణీయం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ 50 సంవత్సరాల వయసు పైబడి కూడా రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన వీరభద్రం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు తమ శారీరక సామర్థ్యాన్ని చాటుకునే విధంగా కూడా ఇలాంటి క్రీడా పోటీలలో పాల్గొని తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాలని తెలిపారు. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో కూడా మరిన్ని పథకాలు సాధించి తనకు, పోలీసులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు.అనంతరం వీరభద్రంని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు సుధాకర్, నరసింహారావు,కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.