ప్రాణ ప్రధాతకు పాదాభివందనం చేస్తే తప్పేంటి..?

సేవా తత్వాన్ని స్వార్థ భావంతో చూస్తున్నారు
ఆశయ సాధనకు ఎన్ని అపవాదులైనా మోస్తా : డిహెచ్ గడల
భద్రాద్రి : భద్రాద్రి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం మెడికల్ కాలేజీని కేటాయించి ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు సొంత జిల్లాలోనే అందేలా చేసిన ప్రాణ ప్రధాత పాదపద్మాలకు అభివాదంచేస్తే తప్పేంటని, తన అభ్యర్థన మేరకు మొదటి విడతలో జిల్లాలో వైద్య కళాశాలను ప్రారంభించారని, సిఎం కెసిఆర్ దార్శనికుడని అలాంటి మహా నేత కాళ్ళు వందసార్లు మొక్కినా దప్పు లేదని, సేవా తత్వాన్ని కొందరు లబ్దికోసం స్వార్థ భావంతో రాజకీయ రంగు పులుముతున్నారని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు ఘాటుగా స్పందించారు. ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలంలోని మామిడి తోటలో నిర్వహించిన కాపు సామాజికవర్గ వనసమారాధన సభలో డిహెచ్ మాట్లాడారు. సొంత జిల్లా ప్రజలకు సేవలందించేందుకు తండ్రి పేరుతో డాక్టర్ జిఎస్‌ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యా, వైద్యం, ఉపాధి అందించడమే లక్ష్యంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏడాదిగా సేవలు అందిస్తామని అన్నారు. సామాజిక సేవను కూడా కొందరు కావాలని రాద్దాంతం చేస్తున్నారని మండి పడ్డారు. తండ్రి ఆశయానికి అనుగుణంగా సేవా మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. యధ్బావం తద్భవతి అన్నట్లు చూసే దృష్టిని బట్టి ఉంటుందని చెప్పారు. సేవాతత్వాన్ని రాజకీయంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ట్రస్ట్ ద్వారా నిరు పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తు, ఉపాధి కలిస్తున్నామని, పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. సేవ తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదని ఉద్ఘాటించారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, ఇకనైనా ఈర్శ, ధ్వేషాలను మానుకుని ప్రజలకు సేవ చేయాలని హితపు పలికారు. కాపు సామాజిక వర్గానికి అన్ని వేళలా అండగా ఉంటానని, తన సొంత సామాజిక వర్గానికి సేవలందించేందుకు అనునిత్యం సిద్ధంగా ఉంటాను అని హామీ ఇచ్చారు. కుల భవనాన్ని ఏడాదిలోగా పూర్చి చేపిస్తాను అన్నారు. సామాజిక వర్గం ఐక్యంగా ఉండాలని తద్వారా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్యారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని కాపులు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. సొంత ఊరు ఎంతో ఇచ్చిందని ఇక మీదట సొంత గడ్డకు ఇవ్వడం నుర్చుకుందామని పేర్కొన్నారు. ఈలక్ష్యంతోనే సొంత ప్రజలకు తనవంతుగా అన్ని విధాలా సహకారం అందిస్తా అన్నారు. మోకాలడ్డు పెట్టినంత మాత్రాని తన తండ్రి ఆశయాలను వదిలేది లేదని, ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎంతటి కష్ట వచ్చినా సేవ చేయడంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తన తండ్రి ఆశయం కోసం అనునిత్యం పరితపిస్తూనే ఉంటానని సూచించారు. సామాజివర్గాన్ని ఒక తాటిపై తెచ్చేందుకు వేదికను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు.