సింగరేణి సిఎండిని విచారణ జరపాలనిహైకోర్టు ఉత్తర్వులు జారీ

కొత్తగూడెం : సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీథర్‌ను విచాచారించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చెసినట్లు సింగరేణి మాజీ ఉద్యోగి టిబిజికెఎస్ నాయకుడు సంపత్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఇంటి అద్దెల చెల్లింపులలో అవినీతికి పాల్పడ్డాడని 2020 మార్చి 4న కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చెసినట్లు తెలిపారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ,ఎంక్వయిరీని రద్దు చేయాలని కోరుతూ కేసును సవాల్ చేస్తూ సిఅండ్‌ఎండి హైకోర్టులో కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. రెండు సంవత్సరాల అనంతరం హైకోర్టు ధర్మాసనం సిఎండి అభ్యర్థనను కొట్టివేస్తూ ఈనెల 2న ఉత్తర్వులు జారీచేసిందని అన్నారు. సిఅండ్‌ఎండిని విచారణ జరపాలని కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు ఉంటే తమకు అందజేసి విచారణకు సహకరించాలంటూ బుధవారం వన్ టౌన్ సిఐ నోటీసులు అందజేసినట్లు చెప్పారు. పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. దీంతో సంపత్ కుమార్ వేసిన కేసులో పురోగతి సాధించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక ఐఏఎస్ అధికారిని విచారణ చేయాలంటూ హైకోర్టు ఆదేశించడం ఇదే మొదటిసారి అంటూ చర్చ జరుగుతుంది.