అలుపెరగని సేవకు అత్యుత్తమ అవార్డు


కొత్తగూడెం: అనునిత్యం ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి రాష్ట్ర ఉత్తమ ప్రోగ్రామ్ వేనేజర్ అవార్డుకు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ వేనేజర్ భూమా నాగేందర్ ఎంపికయ్యారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో గురువారం సిఓఓ ఖలీద్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. జివికె ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 108,102 1962,వాహనాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపికచేశారు. భద్రాచలంలకు చెందిన ఈఎంఈ దుర్గాప్రసాద్ సైతం అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు లభించడం పట్ల ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.