వనమాకు కెటిఆర్‌ అభయ హస్తం

all


కొత్తగూడెం : నియోజక వర్గ అబివృద్దికి మరింత నిధలు కేటాయించాలని మున్సిల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ మినిష్టర్‌ కెటిఆర్‌ను కలిసినట్లు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. హైదరాబద్‌లో మంత్రి కెటిఆర్‌ను కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మర్యద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలో పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలను మరింతగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఇంటిటింకి టిఆర్‌ఎస్‌ పథకాలు అందజేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను మంత్రి కెటిఆర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తూ పట్టణ ప్రాంతాలలను మరింత సుందరంగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్నట్లు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వనమా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రజలకు పనిచేయాలనే వాంచ ఉండాలేగాని వయస్సుతో పని లేదంటూ వెన్ను నొప్పి ఉన్నప్పటికీ కొత్తగూడెం నియోజకవవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు యువ నాయకులకు ధీటుగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే వనమా తీరుకు నియోజకవర్గ ప్రజలు ఫిదా అవుతున్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading