ప్రాణాలు కాపాడే సంజీవిని

ఏజెన్సీలోనే ఇక ఎమర్జెన్సీ సేవలు
సిఎం కెసిఆర్‌కు కలెక్టర్‌ కృతజ్ఞతలు

భద్రాద్రి : ఏజెన్సీ ప్రజల ప్రాణాలు కాపాడే సంజీవినిగా మెడికల్‌ కాలేజీ నిలుస్తుందని, ఇక మీదట అత్యవసర సేవలకు హైదరాబాద్‌ వంటి నగరాలకు పరుగులు తీయక్కరలేదని, సొంత జిల్లాలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. కెఎస్‌ఎం కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను హైదరాబాద్‌ నుండి సిఎం కెసిఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ సిఎంకు జిల్లా ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య కళాశాల తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించిన ఆరు ఏళ్ళ లోనే వైద్య కళాశాల ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. కాళాశాల ఏర్పాటుతో వైద్యం కోసం మారుమూల గ్రామాల ప్రజలు హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాస తగ్గిందని, కార్పోరేటు స్థాయిలో జిల్లాలోనే వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందిని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్‌, హరీష్‌ రావుతో పాటు ప్రజా ప్రతినిధులు, అందించిన సహకారానికి దన్యవాదాలు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజానాకి సేవ చేసేందుకు వైద్య వఅత్తిని ఎన్నుకున్నారని, విద్యార్థులు ఆణిముత్యాలని కొనియాడారు. అద్యాపకులు విద్యార్థులకు తార్కిక శక్తితో ఉత్తమమైన విజ్ఞానాన్ని పెంపొందించేలా బోధన చేయాలని సూచించారు. భోధనా సిబ్బంది ప్రారంభ దశలో వేసే పునాదులే భవిష్యత్తులో విద్యార్థులు మెరికల్లా తయారై ప్రజలకు విశిష్ట వైద్య సేవలు అందించేలాని కోరారు. కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ 42 కోట్లు మంజూరు చేసిందని, ఏడాది కాలంలోనే నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు శ్రమించిన రహదారులు భవనాల శాఖ ఈఈ భీమ్లా పర్యవేక్షణలో అనతికాంలోనే భవనాలు నిర్మించుకున్నామని అర్‌అండ్‌బి అధికారులను ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీని అభినందించారు. జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ నీట్‌ ద్వారా మొత్తం 150 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 92 మంది విద్యార్థులు అడ్మీషన్‌ పొందారని, మిగిలిన 58 సీట్ల కేటాయింపు పూర్తి అవుతందన్నారు. అనంతరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పూల బకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన కెఎస్‌ఎం కళాశాల యాజమాన్యానికి సైతం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మణావు, పర్యవేక్షకులు డాక్టర్‌ కుమారస్వామి, డాక్టర్‌ శ్రీధర్‌, శ్రీకాంత్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ రమేష్‌, ఈఈ భీమ్లా, డిసియంఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్రావు, కొత్తగూడెం మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీమతి కాపు సీతాలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌ దామోదర్‌, యంపిపిలు, భూక్యా సోనా, బదావత్‌ శాంతి, పాల్వంచ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, తహసిల్దార్‌ రంగప్రసాద్‌, తదితరులు పాల్గన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading