ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలి
రాష్ట్ర ఆర్యవైశ్య రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కొదుమూరి

కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా కొత్తగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొదుమూరి శ్రీనివాసరావును నియమితులయ్యారు. ఆర్యవైశ్య సత్రం ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధన కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చారుగుండ్ల శ్రీనివాసరావు నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. రాష్ట్రస్థాయిలో జరిగే రాజకీయ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలించి ఆర్యవైశ్య రాష్ట్ర కమిటీకి నివేదికలు అందించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కొడుమూరి మాట్లాడుతూ తనకు రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, నియామకానికి సహకరించిన రాష్ట్ర ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షుడు, జిల్లా, పట్టణ, మండలాల కమిటీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవీతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం సూచనల మేరకు పని చేస్తాను అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు సైతం రాజకీయ, ఆర్ధికు సామాజిక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను దఅష్టిలో పెట్టుకొని ఆర్యవైశ్య నాయకులకు ఆయా పార్టీలు శాసన సభ్యులుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని, అదే ధోరణిలో ముందుకు సాగుతామన్నారు. కొదుమూరి నియామకం పట్ల ఆర్యవైశ్య ప్రముఖులు దోసపాటి వెంకటేశ్వరరావు, కంభంపాటి రమేష్, మిట్టపల్లి పాండురంగారావు, వల్లపోతు సాయిబాబు, వల్లపోతు శ్రీనివాస్, గుడాల అచ్యుతరావు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.