ఔదార్యం చాటిన వనమా

దివ్యాంగుడికి దళిత బంధు
కొత్తగూడెం : ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేసే ప్రజా నాయకుడు వనమా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగుడికి దళిత బంధు పథకం ద్వారా రూ 10 లక్షలు అందజేసి ఉదారస్వభావాన్ని ప్రదర్శించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో పేద దళిత దివ్యాంగుడికి దళిత బంధు పథకాన్ని మంజూరు చేశారు ఎమ్మెల్యే వనమా. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకంతో లబ్దిపొందిన ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక సావలంబన సాధించి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం పేద దళిత వికలాంగుడి కుటుంబం వనమాకు శాలువతో సన్మానించారు. దివ్యాంగుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా ఆర్థిక అభివఅద్ధికి సహకరించి, దళిత బంధు పథకాన్ని మంజూరు చేసిన సిఎం కేసీఆర్, ఎమ్మెల్యే వనమాకు జన్మత రుణపడి ఉంటామని, తనను గుర్తించి ఈ పథకం ఇచ్చినందుకు వనమా మేలును జీవితంలో మర్చిపోలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ అంబుల వేణు, వేముల ప్రసాద్, బండి నరసింహా స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.