యశోదకు ఎంత కష్టమొచ్చింది..!


మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత


హైదరాబాద్‌ :
ఏ మాయ చేసావె చిన్నది ఇప్పుడు అరుధైన వ్యాదితో మదనపడుతుంది. సౌత్‌ సినీ ప్రేమికుల మనసు దోచుకున్న సమంత రూత్‌ ప్రభు ఇప్పుడు మయోసైటిస్‌ అనే కండరాల వ్యాధితో ఇబ్బంది పడుతుంది. ఏవిషయానైనా కుండ బద్దలు కొట్టినట్లు నిర్భయంగా తన భావాలను వ్యక్తం చేసే సమంత తన యశోద సినిమా ప్రమోషన్‌ సందర్భంగా పలు మిడియా చానళ్ళకు ఇంటర్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా మనసులోని ఆవేదనను ప్రేక్షకులతో పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. మయోసైటిస్‌తో జరుగుతున్న ఈ పోరాటంలో తట్టుకుని నిలబడతానని ఆశిస్తున్నా అన్నారు.

కండరాల బలహీనత, చర్మంపై దద్దుర్లు రావడం, బరువు తగ్గడం, లో జ్వరం, అలసటగా ఉండటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూన్‌ వ్యాధితో తన పోరాటం గురించి మాట్లాడుతూ ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని భావించిన రోజులు ఉన్నాయి. నేను వెనక్కి తిరిగి చూసుకున్న రోజులు ఉన్నాయి, నేను ఇంత దూరం వచ్చినందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అని ఆమె చెప్పింది. భవిషత్తును తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది. గతాన్ని గుర్తు చేసుకుంటే ఎన్నో మైలు రాళ్ళను అదిగమించాను అనే ఆనందంగా అనిపిస్తుంది. భవిషత్‌ మీద బెంగ పెట్టుకోడం కంటే వర్తమానం నుండి పోరాటం మొదలు పెట్టాను అంటోంది.

ఆమె తన సోషల్‌ మీడియా పేజీలలో జీవితం ఎంత కష్టమైనా ‘చూపడం’ ప్రాముఖ్యత గురించి పోస్ట్‌ చేసింది. ‘‘షవర్‌, షేవ్‌, షో అప్‌’’ అని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. గత కొన్ని వారాల క్రితం, ఆమె అనారోగ్యంతో తన కష్టాన్ని వెల్లడిరచింది. ఆమె తన వఅత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఈ వ్యాధిని తప్పక జయిస్తానని సెలబ్రిటీ టీవీ యాంకర్‌ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత అన్నారు. ఈ విడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో సమంత అభిమానులు, సోషల్‌ మీడియా యూజర్లు గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ బాసటగా నిలుస్తున్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading