పక్కా గృహాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం
గూడు లేనివారి గోస సిఎం కెసిఆర్‌కు తెలుసని అందుకే ఇళ్ళు లేని నిరుపేదలకు పక్కా గృహాల కల్పనే లక్ష్యంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. స్థలం ఉండి ఇళ్ళు కట్టుకోలేని పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు గృహలక్ష్మీ పథకం ప్రవేశ పెట్టామని అన్నారు. ఖమ్మం నగరంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో జిఓ నెంబర్ 58 ద్వారా 398 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలు, గఅహలక్ష్మి పథకం క్రింద 230 మంది లబ్ధిదారులకు మంజూరైన ఉత్వర్వులను జిల్లా కలెక్టర్ విపిగౌతమ్‌తో కలిసి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న అర్హుల్కెన ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇస్తామని భరోసా కల్పించామన్నారు.
3 వేల 253 మందికి పట్టాల పంపిణీ
జిల్లాలో గృహలక్ష్మి పథకానికి 15,500 మంది ఎంపిక
మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

ఖమ్మం : గూడు లేనివారి గోస సిఎం కెసిఆర్‌కు తెలుసని అందుకే ఇళ్ళు లేని నిరుపేదలకు పక్కా గృహాల కల్పనే లక్ష్యంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. స్థలం ఉండి ఇళ్ళు కట్టుకోలేని పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు గృహలక్ష్మీ పథకం ప్రవేశ పెట్టామని అన్నారు. ఖమ్మం నగరంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో జిఓ నెంబర్ 58 ద్వారా 398 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలు, గఅహలక్ష్మి పథకం క్రింద 230 మంది లబ్ధిదారులకు మంజూరైన ఉత్వర్వులను జిల్లా కలెక్టర్ విపిగౌతమ్‌తో కలిసి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న అర్హుల్కెన ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇస్తామని భరోసా కల్పించామన్నారు. 2014 నుండి ఉంటున్న వారి నివాస దఅవ పత్రాల ఆధారంగా మొదటి విడతగా 3 వేల 253 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించామన్నారు. ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో పట్టణంలో ఇప్పటికే 2 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు సిఎం కట్టివ్వడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున జిల్లాలో 15,500 మంది లబ్ధిదారులకు బేస్‌మెంట్, స్లాబ్ లెవల్, నిర్మాణం పూర్తి దశలలో మూడు విడతలుగా గృహలక్ష్మీ పథం అందజేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడుతూ ఇళ్ళు లేని పేదలకు పక్కా ఇళ్ళు ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో హైద్రాబాద్ తరువాత అత్యధికంగా పట్టాలు అందించి ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తొడ్పాటు నందించిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.