చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం
ముమ్మాటికీ రాజకీయ కుట్రే

భద్రాద్రి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టులో ముమ్మాటికీ రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన అభిమానులు, అన్ని వార్గల రాజకీయన నాయకులు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా చంద్రబాబు అభిమానులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వాదులందరూ ఈ దుర్మార్గపు చర్యను ఖండిరచాలని విజ్ఞప్తి చేశారు. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు 36 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అందరూ తన లాగా అవినీతి పరులుగా కనిపిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎపి సిఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబుకు ఆవినీతి అంతగాడుతున్నారని విమర్శించారు. కేవలం జగన్ తన కక్ష సాధింపు చర్యలతోనే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజన్ ఉన్న లీడర్‌గా ప్రజల మన్ననలు పొందిన చంద్రబాబు జైల్లో ఉంటే సిఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు రాక్షస ఆనందం పొందుతూ సంబరాలు జరుపుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో సైకో పాలన సాగుతోందని, దీనిని రాబోయే రోజుల్లో ప్రజలు సహించబోరని హెచ్చరించారు. చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా అవినీతి మరక లేని నాయకుడిగా చంద్రబాబు తిరిగి బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.