గంజాయి కేసులో 13 ఏళ్ళ జైలు శిక్ష

గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి 13 ఏళ్ళ కఠిన జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి (స్పెషల్‌ జడ్జ్‌ ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌) ఎం శ్యాంశ్రీ తీర్పు చెప్పారు. భద్రాచలం గోదావరి చెక్‌ పోస్ట్‌ వద్ద 2022 జూలై 2న ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ భద్రాచలం డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ ఫోర్సు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్ఫోర్స్మెంటు కలిసి జాయింట్‌ ఆపరేషన్‌లో చేపట్టిన వాహనాలు తనిఖీలో 391 కేజీల డ్రై గంజాయి పొడిని అక్రమంగా తరలిస్తున్న ట్రాలీని పట్టుకున్నారు.


భద్రాద్రి :
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి 13 ఏళ్ళ కఠిన జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి (స్పెషల్‌ జడ్జ్‌ ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌) ఎం శ్యాంశ్రీ తీర్పు చెప్పారు. భద్రాచలం గోదావరి చెక్‌ పోస్ట్‌ వద్ద 2022 జూలై 2న ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ భద్రాచలం డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ ఫోర్సు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్ఫోర్స్మెంటు కలిసి జాయింట్‌ ఆపరేషన్‌లో చేపట్టిన వాహనాలు తనిఖీలో 391 కేజీల డ్రై గంజాయి పొడిని అక్రమంగా తరలిస్తున్న ట్రాలీని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి మండలం హసన్‌ నగర్‌కు చెందిన మహమ్మద్‌ ఖాన్‌, హైదరాబాద్‌ అమాంనగర్‌ వాసి మహమ్మద్‌ అంజద్‌ ఈ ట్రాలీలో 900 కిలోల ఎల్లిపాయల బస్తాల తోపాటు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఎస్‌కె రహీమున్నీసా బేగం పంచనామా ద్వారా రికవరీ కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. నలుగురు సాక్షుల విచారణలో నేరం రుజువు కావడంతో కోర్డు మహమ్మద్‌ ఖాన్‌, మహమ్మద్‌ అంజద్‌లను దోషులుగా తేల్చింది. ఈకేసులో ఇద్దరికి 13 ఏళ్ళ కఠిన కారాగార శిక్షతోపాటు రూ లక్ష జరిమానా విధిస్తూ జెడ్జ్‌ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున రావి విజయ్‌ కుమార్‌ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నిర్వహించగా, కోర్టు లైజాన్‌ ఆఫీసర్‌ హరి గోపాల్‌, ఎక్సైజ్‌ పిసిఎ నాగేశ్వర్‌ రావులు సహకరించారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading