జెఎసి లేబర్‌ కోడ్‌ పేపర్ల దగ్థం !

సింగరేణి : కేంద్ర ప్రభుత్వం 29కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాలు మారుస్తూ కార్మికులకు అందాల్సిన అలవెన్సులు, ప్లేడే లు తదితర సౌకర్యాలను కాలరాస్తు పెట్టుబడిదారులకు అనుకూలంగా 12గంటలకు పైగా పని చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల మీద లేబర్‌ కోడ్‌ల రూపంలో పని గంటల ఒత్తిడి తీసుకొస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఉదయం బస్టాండ్‌ సెంటర్‌ వద్ద నూతన లేబర్‌ కోడ్‌ చట్టాల కాగితాలను దగ్థం చేశారు.

 

అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అడ్మిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. దశాబ్దాల క్రితం అనేక పోరాటాలు చేసి సాధించిన హక్కులను కాలరాసేలా బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లు అమలులోకి తెస్తున్నదని, దీని వల్ల కార్మికులు అనేక హక్కులు కోల్పోనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు సెంట్రల్‌ సెక్రటరీ వంగ వెంకట్‌, వీరస్వామి, రమణమూర్తి, గట్టయ్య, మండల రాజేశ్వరరావు, బండారి మల్లయ్య, సిపిఐ పార్టీ నాయకులు నారాటి ప్రసాద్‌,జములయ్య నాగేష్‌, కోటి, ఐఎన్‌టీయూసి నాయకులు,త్యాగరాజన్‌,ఆల్బర్ట్‌, పితంబరం, టిబిజికేఎస్‌ నాయకులు కుశాన వీరభద్రం, కాపు కృష్ణ,తుమ్మ శ్రీను, రాజా రావు, విజయపురి శ్రీనివాస్‌  పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading