మంత్రి పొంగులేటిని కలిసిన జిల్లా అధ్యక్షురాలు

కొత్తగూడెం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్దిలను జిల్లా డిసిసి అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆమె కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఆర్‌ఆర్‌ఆర్ ఆమెను అభినందించారు. భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ భవిష్యత్తు కార్యక్రమాలపై ముఖ్యమైన సలహాలు, సూచనలు చేశారు. పార్టీ బలోపేతం, కేడర్‌కు ఉత్సాహం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సాగాల్సిన పార్టీ చైతన్య కార్యక్రమాలపై పలు సలహాలు ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ ఉన్నారు.