నిబద్దతతో విధులు నిర్వర్తించాలి

  • బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలి
  • వన్‌ టౌన్‌ను తనిఖీ చేసిన డిఎస్పీ రెహమాన్‌

కొత్తగూడెం : పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిఎస్పి అబ్దుల్‌ రహమాన్‌ ఆదేశించారు. కొత్తగూడెం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రభుత్వ కిట్‌ ఆర్టికల్స్‌ను డిఎస్పీ బుధవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్‌ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే బాధ్యతగా మెలగాలని సూచించారు.

పెండిరగ్‌ కేసు ల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.పోలీస్‌ స్టేషన్లో వర్టికల్స్‌ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా పనితీరు పరిశీలించారు.

ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్‌, బ్లూ కోల్ట్స్‌ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్‌ 100 కు ఫోన్‌ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు.పోలీస్‌ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వన్‌ టౌన్‌ సిఐ కరుణాకర్‌,ఎస్సైలు రాకేష్‌, విజయ కుమారి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading