జిల్లా అధ్యక్షురాలిని సన్మానించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు

లక్ష్మీదేవిపల్లి : కాంగ్రెస భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నను యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ ఏనుగుల పవన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కారుకొండ కాంగ్రెస్ నాయకులు ఆమెను మర్యదపూర్వకంగా కలిశారు. జిల్లా నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాలోత్ బలరామ్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగుల వెంగళరావు, మాలోత్ లక్ష్మణ్, గుండ్ల రవి, యాసారపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.