కోయగట్టు స్కూల్‌కు శాశ్వత భవనం

  • ట్రైనీ కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ

కొత్తగూడెం: పాల్వంచ మండలంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, కోయగట్టును అసిస్టెంట్‌ కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎన్‌ సతీష్‌ కుమార్‌, ఎస్‌కె సైదులుతో కలిసి పరిశీలించారు. జిల్లాలో నూతనంగా మంజూరైన కోయగట్టు పాఠశాలకు శాశ్వత భవనంను వెంటనే నిర్మించుటకు ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కి ఇస్తామని గ్రామస్తులకు తెలియజేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్వహిస్తున్న పాఠశాలను పరిశీలించి, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు పరిశీలించి సంతృప్తి ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా గ్రామస్థులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీరామ్మూర్తి, కాంప్లెక్స్‌ సిఆర్పి శ్రీనివాస్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading