కొత్తగూడెం పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గుడివాడ

కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గుడివాడ సీతారామరాజు ఎంపికయ్యారు. కొత్తగూడెం సన్యాసి బస్తికి చెందిన గుడివాడ సీతారామరాజును కొత్తగూడెం పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తూ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరాల రవికుమార్ నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీతారామరాజు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాలు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు దివంగత గుడివాడ రామ్ లక్ష్మణ్ వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన తనకు దళిత వర్గాలకు సేవ చేసే అవకాశం కల్పించిన పార్టీకి, నాయకత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. సీతారామరాజు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.