విద్యాధరి ఫౌండేషన్ కి రూ10 వేల విరాళం
కొత్తగూడెం : కొత్తగూడెంలోని విద్యాధరి ఫౌండేషన్ కు మహిళా కానిస్టేబుల్ రూ 10 వేలు విరాళంగా అందజేశారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బి పావని, విద్యాధరి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బైరి రాజేష్ ఖన్నాకు శనివారం కొత్తగూడెంలో అందజేశారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ పావని మాట్లాడుతూ విద్యాధరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమంది పేదలకు, మారుమూల ప్రాంత ఆదివాసీలకు, అనాధలకు ఉపయోగపడుతున్నాయన్నారు. తనవంతుగా సహాయ సహకారమందించే దానిలో భాగంగా విరాళం అందజేసినట్లు తెలిపారు.అనంతరం ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ ఉండి ఉన్నత చదువులు చదువుకోలేని విద్యార్థినీ విద్యార్థులకు చేయూతను అందిస్తున్నామని తెలిపారు. దీంతోపాటుగా పేద ప్రజలకు, అనాధలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదలకు, అనాధలకు ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందించేవారు ఫౌండేషన్ సభ్యులు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాధరి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.