వెంట పడొద్దంటే వెంబడిరచి దాడి
- పాల్వంచలో నడిరోడ్డుపై పిడి గుద్దులు
- యువకుడి పై అల్లరి మూకల దాడి

పాల్వంచ : బంధువుల అమ్మాయి వెంట పడొద్దు అన్నందుకు యువకుడి పై అల్లరి మూక దాడికి తెగబడిరది. నడిరోడ్డు పై విచక్షణారహితంగా పిడుగుద్దులతో విరుచుకు పడ్డారు. పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన ఎలక్ట్రిషీయన్‌గా పని చేస్తున్న నరేష్ పై దమ్మపేట సెంటర్‌కి చెందిన యువకులు దాడికి తెగబడ్డారు. గురువారం నరేష్ పని నిమిత్తం పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి వెళ్తున్న సమయంలో ముందుగానే పదకం పన్ని మాటు వేసి మరీ విచక్షణ రహితంగా నరేష్ పై పిడిగుద్దులు కురిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన యువకులను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు పోలీసులు దాడి చేసిన యువకులను పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
దాడి చేసిన యువకులు మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో నరేష్ తలపై తీవ్ర గాయం అవ్వడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆకతాయిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వంచ ప్రజలు కోరుకుంటున్నారు.