గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి

  • ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి
  • నిర్వహణ కమిటీలదే బాధ్యత
  • దిశా నిర్దేశలు జారీ చేసిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

కొత్తగూడెం :  వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. శనివారం వన్ టౌన్ పోలీసులు స్టేషన్ లో సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కొత్తగూడెం డివిజన్ పరిధిలోని వినాయక మండపల కమిటీలకు దిశా నిర్దేశలు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్  ఆదేశాల మేరకు  డివిజన్ పరిధిలో ఈ నెల 27 న వినాయక చవితి నవరాత్రుల నేపథ్యంలో ముందస్తుగా వాడ వాడ లో వినాయకుడి మండపాల ఏర్పాటుకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమతులను, మండపల వద్ద పాటించే నియమ నిబంధాలను కమిటీలకు వివరించారు. మండపాలను రోడ్ ఆక్రమించి పెట్టవద్దని, మండపాల వద్ద సౌండ్  పూజ సమయంలో మాత్రమే తక్కువ శబ్దం వచ్చేలా చూడాలని సూచించారు.

మండపాల వద్ద డి జె సౌండ్ సిస్టం, మద్యం సేవించడం,  ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరిగిన కమిటీ సభ్యులదే పూర్తి బాధ్యతని,  వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయకుడి  నిమజ్జన ఊరేగింపులో మద్యం సేవించి డిజె సౌండ్ బాక్స్ లతో నృత్యాలు చేస్తూ ట్రాఫిక్ నియమ నిభందనాలు పాటించక పోయిన కమిటీ సభ్యులే బాధ్యత వహించాలి అన్నారు. నిమజ్జనం రోజున క్రాకర్స్ ని ఉపయోగించారాదని,
అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తి శ్రద్దలతో నవరాత్రులు జరుపకోవాలని కోరారు. ముందస్తుగా ఏ రోజు నిమజ్జనం చేస్తారో పోలీసులకు సమాచారం ఇస్తే నిమజ్జన ప్రాంతంలో సరైన బందోబస్త్ నిర్వహిస్తాము అన్నారు. ఈ సమావేశంలో  సిఐలు శివప్రసాద్,  ఆర్ వి వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, రవి,  రాకేష్, విజయ,  బేగ్ పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading