అప్రతిహతంగా ఆపరేషన్‌ చేయూత

  • ఆరుగురు దళ సభ్యుల లొంగుబాటు
  • తక్షణ సహాయంగా రూ 25వేలు అందజేత
  •  306 మంది మావోల లొగుబాటు
  • జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు

కొత్తగూడెం: జిల్లాలో ఆపరేషన్‌ చేయూత అప్రతిహతంగా కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు తెలిపారు. గురువారం జిల్లా ఎస్పి కార్యాలయంలో ఎస్పి ఎదుట ఆరుగురు మావోయిస్టు సభ్యులు లొంగిపోగా అందులో ముగ్గురు మహిళా సభ్యులు ఉన్నారు. మడకం లక్మి కుంట ఏరియా కమిటీ 4వ ప్లాటూన్‌ పిపిసిఎం, పార్టీ సభ్యులు సోడి భీమె , సోడి రాజే, మిలిషియా డిప్యూటి కమాండర్‌ మడివి సోన, మిలిషియా సభ్యులు మడివి భీమా, మడకం భీమయ్య లొంగిపోయినట్లు వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ జిల్లా పోలీసులు, 81, సిఆర్‌పిఎఫ్‌ 141 బెటాలియన్‌ అధికారులు సంయుక్తంగా ఆధివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిర్వహిస్తున్న ఆపరేషన్‌ చేయూత కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న సదుపాయాలతో ఆదివాసీలు, గిరిజనులు పెద్ద ఎత్తున నక్సలిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని స్పష్టం చేశారు.

కుటుంబ సమ్యలతో కలిసి ప్రశాంత జీవరం గడపాలని నిర్ణయించుకొని వివిధ స్థాయిలలో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగుబాటు బాట పడుతున్నారని పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కేవలం ఈ ఏడాదిలో జిల్లాలో 306 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారని వెల్లడిరచారు. డివిసిఎంఎస్‌ 4, ఎసిఎంఎస్‌ 20, పిఎంఎస్‌ 39, మిలిషియా సభ్యులు 110, ఆర్‌పిసి సభ్యులు 35, డిఎకెఎంఎస్‌, కెఎస్‌ఎంఎస్‌ఎస్‌ 47, సిఎన్‌ఎం సభ్యులు 30, జిఆర్‌డి సభ్యులు 21 జనజీవన స్రవంతిలో కలిసి పునరావాస సౌకర్యాలను పొందుతున్నారు అని ఎస్పి తెలిపారు. అంపశయ్య పై ఉన్న మావోయిస్టు పార్టీ భవిష్యత్తును చూసి కిందిస్థాయి క్యాడరు హైకమాండ్‌ ఆదేశాలను వ్యతిరేకించి రహస్య ఉద్యు జీవితం వీడి సొంత గ్రామాలకు వెళ్లి కుటుంబాలతో కలిసి ప్రశాంతమైన జీవటాన్ని గడపాలని కోరుకుంటున్నారని చెప్పారు.

అడవుల్లోని ఆదివాసి గ్రామాల ప్రజలు మావోయిస్టు పార్టీకి సహకరించక పోవడం వలన ఎవరికి ఆహార పదార్థాలు దొరకక క్యాడర్ల ఆరోగ్యం క్షీణించిందని, కనీసం నడిచి వెళ్లే శక్తి లేదని సమాచం ఉందన్నారు. 90శాతం పైగా క్యాడర్లు నిరుపేద ఆదివాసీలు, తమ కుటుంబ అభివృద్ధి ముఖ్యమని తలచి పార్టీని వీడి జీవన స్రవంతిలో కలుస్తున్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన 6 మంది మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి రూ 25 వేల చొప్పున మొత్తం రూ 1.5 లక్ష్యలు ఇచ్చాము అన్నారు. ర్యాంకుల వారిగా మిగతా నగదును ఆధార్‌ కార్డులు బ్యాంక్‌ ఆకౌంటు వచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాలలో మిగతా మొత్తం చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఎంతో సానుకూలంగా స్పందిస్తుందని అన్నారు.

కర్ర గుట్టలలో అటవీ సంపదను రక్షించి ఆదివాసీలు స్వచ్చగా ఉపయోగించుకోవడానికి కావలసి పొలీసు క్యాంపులను, కేంద్ర బలగాలు ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పారు. కాలం చెల్లిన మావోయిస్టులతో ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవని, కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా మాత్రమే ఆభివృద్ధి సాధ్యం అన్నారు. అభివృద్ధిలో కూడిన ప్రజల శాంతియుత జీవం పొలీసులు నినాదమని జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు అన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading