రైలు మార్గాన్ని ప్రారంభించిన మోదీ
సింగరేణి ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు
రాజకీయ వ్యాపరస్తులే అమ్మాలని చూస్తున్నారు
స్వార్థ రాజకీయాలకు తెలంగాణ సమాజాన్ని బలిచేస్తున్నారు

భద్రాద్రి : తెలంగాణలో అందవిస్వాసం రాజ్యమేలుతుందని దీనిని తెలంగాణ ప్రజలు ఎక్కువరోజులు సహించరని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రామగుండంలో ఆర్‌ఎఫ్‌సిఎల్ తోపాటు భద్రాచలం రోడ్, సత్తుపల్లి నూతన రైల్వే లైన్‌ను వర్చ్యువల్‌గా బటన్ నొక్కి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సామాజిక, ఆర్థిక అభివృద్దికి ఈ నూతన రైల్వే లైన్ దోహదపడుతుందన్నారు. భారీ పరిశ్రమలకు, బగ్గు ఉత్పత్తి, విద్యుత్ రంగ సంస్థలకు బగ్గు రవాణా రైలు మార్గంతో సులభతరం అవుతుందని అన్నారు. బగ్గు రవాణ వ్యయం కూడా ఘననీయంగా తగ్గుతుందని, కాలుష్యం నివారించవచ్చని తద్వారా పర్యావరణ అనుకూల రవాణా విధానాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడోర్, కాకతీయ మెగా టెక్స్‌స్టైల్ పార్క్ రహదారుల కలయికతో ఈ మార్గం సామార్థ్యాన్ని పెంచనున్నదని చెప్పారు. స్వార్థ రాజకీయ నాయకులు స్వలాభం కోసం జ్రలల్లో గందరగోలానికి గురిచేస్తున్నారని, తెలంగాణలో ఇప్పుడు ఇదే నడుస్తుందని ఎద్దేవ చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హైదరాబాద్‌లో కూర్చున్న నేతలు దుష్ట్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
సంస్థలో అధిక శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది అయితే కేంద్రం బొగ్గు బ్లాకులును ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. రాజకీయా వ్యాపారస్తులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతూ కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి సంస్థను అమ్మే ప్రసక్తి లేదని కొందరు తమ స్వార రాజకీయ ప్రయోజనాలకు యావత్తు తెలంగాణ సమాజాన్ని అసత్య ఆరోపణలతో తప్పు దోవ పట్టిస్తున్నారని హితవు పలికారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణలో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క ఉప ఎన్నికతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతటిని తమ నియోజక వర్గానికి వచ్చేలా మునుగోడు ప్రజలు చేశారని గుర్తు చేశారు. ఈకార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి రావడంతో హైదరాబాద్‌లో ఉన్న పాలకులకు నిద్ర పట్టదంటూ చమత్కరిస్తూనే చురకలు అంటించారు. ఈ అభివృద్ది కార్యక్రమాలతో రైతులకు యావత్తు తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర గౌవర్నర్ తమిళిసై సౌంధర్యరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజన్ పాల్గన్నారు.
మోదీకి కోనేరు కృతజ్ఞతలు
కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నూతన రైలు మార్గం ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.

కేంద్రాన్ని బూచిగా చూసిస్తూ కెసిఆర్ ప్రభుత్వం సింరగేణి కార్మికులను వంచిస్తుందని, ప్రైవేటీకరణపై స్వయానా ప్రధాని మోదీ స్పష్ట ఇచ్చారని ఇకనైనా కార్మికులు, యువత అధికార పార్టీ మాయలో పడొద్దని సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిథులు అభివృద్ధి కార్యక్రమాలకు గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోని పాలకులు కనీసం జిల్లా అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనకపోడం సిగ్గుచేటని అన్నారు. కొవ్వూరు, ఇతర ప్యాసింజర్ రైళ్ళను పునరుద్ద రించాలని ఎడిఆర్‌ఎం ప్రధీప్ రాథోడ్‌ను కోరారు. రైలు మార్గానికి కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రత్యే ధన్యావాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎడిఆర్‌ఎం ప్రధీప్ రాథోడ్, బిజెపి నాయకులు, ప్రజలు, రైల్వే ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.