మంత్రివర్గంలో లంబాడాలకు చోటు కల్పించాలి

  • లేదంటే గాందీ భవన్‌ ఎదుట నిరస చేపడతాం
  • సేవాలాల్‌ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ నాయక్‌

కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో లంబాడా ఎమ్మేల్యేలకు చోటు కల్పించాలని సేవాలాల్‌ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్‌ నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొత్తగూడెం పట్టణంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్బభంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్‌ బంజారా సంఘం ఈ నెల 30న హైదరాబాద్‌ గాంధీ భవన్‌ కార్యాలయం ఏదుట నిరసన చేపడతామని వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ పార్టీ లంబాడ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడా సామాజిక వర్గ ఓట్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీకి వేయడంతో అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో లంబాడాలు పేద్ద సంఖ్యలో ఉన్నా ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సామాజికవర్గాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఇప్పటికైనా తాజాగా జరిగే మంత్రివర్గ విస్తరణలో లంబాడ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అన్నారు. లేని పక్షంలో తీవ్ర వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని లంబాడ సామాజిక వర్గం బహిష్కరిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లంబాడ సామాజిక వర్గం ఒక్కతాటిపై వచ్చి కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకిస్తుందని వెల్లడిరచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ శ్రీనివాస్‌ నాయక్‌, సేవాలాల్‌ బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు నునావత్‌ రాంబాబు నాయక్‌, రాష్ట్ర కోశాధికారి భుక్యా రవికుమార్‌ నాయక్‌, రాష్ట్ర కార్యదర్శి బట్టు వీరన్న నాయక్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బోడ శ్రీనివాస్‌ నాయక్‌, జిల్లా కార్యదర్శి బోడ మంగ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading