సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- పోలీసులకు బీజేపీ నాయకుల ఫిర్యాదు

పాల్వంచ : జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్ ఉగ్రదాడి పై పాల్వంచలో సోషల్ మీడియా వేధికగా భారత దేశం మీద, ప్రధాని నరేంద్ర మోదీ పై దుష్ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో పాకిస్తాన్ ఉగ్రదాడి ఘటనలో దేశంలో ప్రజలందరు బాధ పడుతుంటే, కొందరు కేవలం బీజేపీ పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీద ద్వేషం పెంచుకొని సోషల్ మీడియాలో దేశం, సైనికులు, ప్రధాన మంత్రి మీద విద్వేషపూరితంగా తప్పుడు సమాచారంతో ఫేస్ బుక్‌లో పోస్ట్‌లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచలో కొందరు వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా దేశ ప్రధాని మోదీ పెహల్గామ్‌లో పర్యాటకులని చంపించాడని ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటి సున్నిత అంశం మీద తప్పుడు ప్రచారం చెయ్యడం వలన దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌లు పెట్టిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో భట్టు నరేష్, మాలోత్ ప్రశాంత్,మాదారపు లక్ష్మణ్, సన్నీ పాల్గొన్నారు.