అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు

  • వివరావు వెల్లడిరచిన డిఎస్పి ఎన్‌ చంద్రభాను

ఇల్లందు : మావోయిస్టు పార్టీ పేరు చెప్పి అక్రమ వసూళ్ళకు పాల్పడతున్న ఇద్దరు వ్యక్తులను గుండాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు డిఎస్పి ఎన్‌ చంద్రభాను వివరాలు వెల్లడిరచారు. సోమవారం ఎస్సై రవూఫ్‌ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా తురుబాక గ్రామం వద్ద రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారని తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆళ్లపల్లి మండలం నడిమిగూడెంకు చెందిన యువకుడు పాయం రాజేందర్‌, గుండాల మండలం ఘణపురం గ్రామానికి చెందిన కల్తీ పాపయ్య అలియాస్‌ సర్పంచ్‌గా గుర్తించామన్నారు. ఈ ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారని స్పష్టం చేశారు.

కల్తీ పాపయ్య 2010లో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్‌ అయ్యి జైలుకి వెల్లి వచ్చాడని, పాయం రాజేందర్‌ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్‌ ఎదుట లొంగిపోయాడని స్పష్టం చేశారు. జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల, ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్‌ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారని వెల్లడిరచారు. రూ 5వేలు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకొన్నామని చెప్పారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డియస్పి చంద్రభాను తెలిపారు. ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీసులకు పిర్యాదు చేయాలని కోరారు. ఇద్దరిని పట్టుకోవటంలో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్‌, ఎస్‌ ఐ సైదా రావూఫ్‌, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లును డియస్పి అభినందించినారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading